ధనుష్ హీరోగా మరదలి సినిమా!

రజినీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యను వివాహం చేసుకున్న ధనుష్ ఆ తరువాత చాలా సినిమాల్లో నటించాడు. ఐశ్వర్య స్వయంగా తన భర్తను హీరోగా పెట్టి ‘3’ అనే ప్రేమకథను సినిమాగా రూపొందించిన సంగతి తెలిసిందే. ఐశ్వర్య చెల్లెలు సౌందర్య గ్రాఫిక్ రంగంలో మంచి పట్టు సాధించింది. అయితే అక్కలానే మెగాఫోన్ పట్టాలని ఏకంగా తన తండ్రిని హీరోగా పెట్టి మోషన్ ఫార్మాట్ లో ‘కొచ్చాడయాన్’ అనే యానిమేషన్ చిత్రాన్ని రూపొందించారు. దీని తరువాత తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా రూపొందించాలని సౌందర్య భావించారు. దీనికి సంబంధించి రీసెర్చ్ కూడా చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాను పక్కన పెట్టేసి తన బావ ధనుష్ ను హీరోగా పెట్టి సినిమా చేయాలనుకుంటోంది. ఈ చిత్రాన్ని కలైపులి థాను.ఎస్ నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ టాక్. ఇటీవలే సౌందర్య తన వివాహాన్ని రద్దు చేసుకుంటున్నానని చెప్పి వార్తల్లో నిలిచిన సంగతి విధితమే..
CLICK HERE!! For the aha Latest Updates