దర్శకత్వం వైపు హీరో చూపు!

తమిళ హీరో ధనుష్ నటుడిగా, నిర్మాతగా, సింగర్ గా, గీత రచయితగా తన టాలెంట్ ను
నిరూపించుకుంటున్నాడు.
ఇప్పుడు ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి తన దృష్టి దర్శకత్వం వైపు పెడుతున్నాడు. డైరెక్టర్
గా ఓ సినిమా చేయాలనేది ధనుష్ కోరిక.
ఆ కోరికను నెరవేర్చుకోనే ప్రయత్నంలో మన హీరో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే
స్క్రిప్ట్ ను కూడా సిద్ధం చేసుకున్నాడు.
ఈ సినిమాలో హీరోగా రాజ్ కిరణ్ నటించనున్నాడని తమిళ వర్గాల ద్వారా తెలుస్తోంది.
రాజ్ కిరణ్ తో పాటు ధనుష్ కూడా నటించే అవకాశం లేకపోలేదు. త్వరలోనే ఈ సినిమా
సెట్స్ మీదకు వెళ్లనుంది.

CLICK HERE!! For the aha Latest Updates