HomeTelugu Trending'రణరంగం' ట్రైలర్‌

‘రణరంగం’ ట్రైలర్‌

7 3యంగ్‌ హీరో శర్వానంద్‌ సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రణరంగం’. ఈ చిత్రంలో కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌లు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఆదివారం ట్రైలర్‌ విడుదల వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి, ట్రైలర్‌ విడుదల చేశారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన రాగా, ట్రైలర్‌ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఇందులో శర్వానంద్‌ పాత్ర రెండు భిన్న కోణాల్లో సాగనుంది. ప్రశాంత్‌ పిళ్లై సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై సూర్యదేవర నాగ వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu