
సంక్రాంతి కోసమని ఎక్కడెక్కడ నుంచో ఊరు బయలు దేరిన ఆంధ్ర ప్రజలకు గొప్ప అనుభూతి కలిగింది. కాదు, కాదు.. సీఎం జగన్ రెడ్డి గోరు గొప్ప ఫీల్ ను ఇచ్చారు. గోతుల మధ్య రోడ్లు వెతుక్కుంటూ వెళ్లేలా చేయడం ఒక్క మూడు ముక్కల ముఖ్యమంత్రికి మాత్రమే సాధ్యం అని నిరూపించారు. నిత్యం పేపర్లలో టీవీలలో ఏపీలోని గోతుల మధ్య రోడ్లును చూసి చూసి ఉండటం చేత.. ప్రజలు ముందుగానే మానసికంగా ప్రిపేర్ అయ్యి ఏపీకి వెళ్లారు. అయినా ఊహకు కూడా అందనంత అనుభూతి కలిగింది. ఒక్క మాటలో ఆంధ్ర రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందంటే.. అడుగుకో గుంత, గజానికో గొయ్యిగా మారింది. రోడ్ల పరిస్థితిపై ప్రతిపక్షాలే కాదు, ప్రజలు కూడా ధ్వజమెత్తినా జగన్ పక్షానికి చీమకుట్టినట్లుగా కూడా లేకపోవడం ఒక్క బటన్ రెడ్డికి మాత్రమే సాధ్యమయ్యే పని.
ఈ రోడ్లు దెబ్బకు ఏపీలోని ప్రయాణికులంతా అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. తలకి తలా, మొండానికి మొండెం వేరయినట్టు… ఒంట్లో అవయవాలు చెల్లాచెదురైనట్టు… కూర్చున్న చోటే కూసాలు కదిలిపోయినట్టు… కడుపులో వాషింగ్ మెషీన్ తిరుగుతున్నట్టు.. యమపురికి దగ్గరి దారి అన్నట్టు.. ఇలా ఎన్నో రకాలుగా అనుభూతి చెందారు. కాదు, కాదు.. మన బటన్ మోహన్ రెడ్డే చెందేలా చేశారు. కాబట్టి.. ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్లు అంత అధ్వాన్నంగా ఉన్నాయా అని ప్రజలు అనుకోవద్దు. ఒక్క ఛాన్స్ అనగానే ఓట్లు బలంగా గుద్ది మరీ గెలిపించారు కాబట్టి.. ప్రజలంతా ఇలా ఫీల్ అవ్వొచ్చు.
ప్రస్తుత కాలంలో జనాలంతా ఎగ్జిబిషన్లలో వేలకు వేలు అడ్వెంచర్ రైడ్లకు తగలేస్తున్నారు. కదా… ! అందుకే, మన బటన్ రెడ్డి ‘ఒళ్ళు హూనం’ అనే పధకం ద్వారా.. అత్యద్భుత అధ్వాన్న రోడ్లను తయారు చేశారు. కావున, ప్రజలంతా ఈ దిక్కుమాలిన రోడ్ల పై తిరిగి జీవితాంతం గుర్తుండిపోయే సాహస యాత్రను ఉచితంగా అనుభూతి చెందండి. చూశారా.. మన మూడు ముక్కల ముఖ్యమంత్రి ప్రజలకు ఎలాంటి సంతృప్తిని ఇస్తున్నాడో ?. ప్రజలకు ఇలాంటి గొప్ప అనుభూతి ఇవ్వాలని బటన్ రెడ్డి రోడ్లను గోతులతోనే ఉంచేస్తే… ఎందుకండీ గోల చేస్తారు. అయినా గాల్లో ఎగిరిపోవడం, జీరో గ్రావిటీ అనుభూతి చెందడం ఎక్కడైనా ఇంత చవగ్గా వస్తుందా!. మరెందుకు ? మా మూడు ముక్కల ముఖ్యమంత్రిని అభినందించరు ?.
కాబట్టి.. ఏపీ ప్రజల్లారా.. ఇక నుంచి రోడ్ల పై వెళ్ళేటప్పుడు.. ఆపండ్రోయ్ … ఆపండ్రోయ్ అని హాహాకారాలు చేయకుండా.. బటనన్న ఇచ్చిన మజాని ఎంజాయ్ చేయండి. ఏ.. ? ఓట్లు వేసినప్పుడు లేని నొప్పి ఇప్పుడెందుకు ?, కాబట్టి.. ఆస్వాధించండి. అన్నిటికీ మించి బటన్ రెడ్డిని అర్ధం చేసుకోండి.
వర్జిన్ గలాక్టిక్ సంస్థ అందిస్తున్న అంతరిక్ష యాత్ర టికెట్టు ఖర్చు ఎంతో తెలుసా ?, ఒక మనిషికి అక్షరాల 4,50,000 డాలర్లు. అదే ఏపీలో అయితే ఉచితంగానే మన బటనన్న అండాండ బ్రహ్మాండాలు చూపిస్తున్నాడు. దటీజ్ బటన్ అన్న. దటీజ్ మూడు ముక్కల రెడ్డి.














