‘డియర్‌ కామ్రేడ్‌’ ఫస్ట్‌లుక్‌

క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటిస్తున్న మూవీ ‘డియర్‌ కామ్రేడ్‌’. ఈ సినిమాకి భరత్‌ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. లుక్‌లో రష్మిక.. విజయ్‌ను హత్తుకున్నట్లుగా ఉన్న ఈ లుక్‌ ఆకట్టుకుంటోంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నట్లు విజయ్‌ ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. మార్చి 17న ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. రష్మిక, విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న రెండో చిత్రమిది. గతంలో వీరిద్దరూ జంటగా ‘గీత గోవిందం’ చిత్రంలో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, బిగ్ బెన్ బ్యానర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates