HomeTelugu Trending'డియర్‌ మేఘ' స్పెషల్‌ పోస్టర్‌

‘డియర్‌ మేఘ’ స్పెషల్‌ పోస్టర్‌

Dear megha special poster

మేఘా ఆకాష్, అరుణ్ అదిత్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘డియర్ మేఘ’. అర్జున్ దాస్యన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించాడు. ఈ రోజున అదిత్ అరుణ్ పుట్టినరోజు కావడంతో, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. హీరోహీరోయిన్‌తో కూడిన ఈ పోస్టర్, చక్కని ఫీల్ తో ఆకట్టుకుంటోంది.

ఈ సందర్భంగా ఈ సినిమా దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘అదిత్ అరుణ్ ఇంతకుముందు ప్రేక్షకులకు హీరోగా పరిచయమే. అయితే మా సినిమాలో అతను కొత్తగా కనిపిస్తాడు. ఆయనకు లభించిన మంచి పాత్ర ఇది.. యూత్ ను ఎంతగానో ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది. ఈ సినిమా ఆయన కెరియర్ కి చాలా హెల్ప్ అవుతుందని నమ్మకంగా చెప్పగలను. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఓటీటీ ద్వారానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి” అని చెప్పుకొచ్చారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu