HomeTelugu Trendingదీపావళి 'సినీ' పోస్టర్లు ఇవిగో..

దీపావళి ‘సినీ’ పోస్టర్లు ఇవిగో..

దీపావళి పండుద సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయా సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను, ఫస్ట్‌లుక్‌లను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందాలు విడులచేశాయి. మరి దీపావళికి వచ్చిన పోస్టర్లపై ఓ కన్నేయండి..

‘సరిలేరు నీకెవ్వరు’

మహేశ్‌బాబు ‘మేజర్‌ అజయ్‌కృష్ణ’ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్‌. ఈ చిత్రంలో విజయశాంతి కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే మహేష్‌బాబు, విజయశాంతి లుక్‌లను విడుదల చేసిన మూవీ యూనిట్‌ ఆదివారం దీపావళి సందర్భంగా రష్మిక పాత్రకు సంబంధించిన ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. దీనిలో రష్మిక పెళ్లిచూపులకు కూర్చున్నట్లు కనిపిస్తుంది. మరోవైపు మహేష్‌ నవ్వుతూ చాలా కూల్‌గా కనిపించారు. ఈ చిత్రం వచ్చేఏడాది జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

4a

‘అల వైకుంఠపురములో..’

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అల.. వైకుంఠపురములో..’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజాహెగ్డే హీరోయిన్‌. దీపావళి సందర్భంగా ఇప్పటికే ఈ సినిమాలోని ‘రాములో.. రాములా..’ అనే పాటను విడుదల చేసిన చిత్రబృందం ఆదివారం కొత్తపోస్టర్‌తో అభిమానులను పలకరించింది. సినిమాలో కీలకపాత్రలు పోషించిన వారందరితో ఈ పోస్టర్‌ ఉంది. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

4b

‘డిస్కోరాజా’

రవితేజ నటిస్తున్న చిత్రం ‘డిస్కోరాజా’. నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. ఈ చిత్రానికి వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పండగ శుభాకాంక్షలు తెలియచేస్తూ.. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో రవితేజ, నభానటేష్‌ జంటగా కనిపించారు.

4 21

‘భీష్మ’..

నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘భీష్మ’. రష్మిక హీరోయిన్‌గా ఈ సినిమా నుంచి దీపావళి పండుగ సందర్భంగా.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్లను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులోని ఓ పోస్టర్‌లో రౌడీలతో ఫైట్‌ చేస్తున్నట్లు ఉన్న నితిన్‌.. మరో పోస్టర్‌లో రష్మిక అందానికి ముగ్ధుడైనట్లు కనిపించారు. ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు.

4c

‘సూపర్‌ మచ్చి’

మెగాస్టార్‌ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సూపర్‌మచ్చి’. పులివాసు దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో రియా చక్రవర్తి హీరోయిన్‌. శనివారం టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం.. ఆదివారం కళ్యాణ్‌దేవ్‌‌-రియా జంటగా ఉన్న మరో రెండు పోస్టర్లను విడుదల చేసింది.

4d

Recent Articles English

Gallery

Recent Articles Telugu