HomeTelugu Trendingసెలెబ్రిటీల సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్

సెలెబ్రిటీల సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్

7 17
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. చేతులు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోజుకు కనీసం ఐదారుసార్లు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి అని చెప్పింది. దీనిపై అందరిలో అవగాహన కల్పించేందుకు సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ ను తీసుకొచ్చింది. సెలెబ్రిటీలు దీనిపై ప్రచారం చేయాలని, అందరికి అవగాహనా కల్పించాలని కోరింది. దీపికా పాదుకొనే, అనుష్క శర్మ చేతులను శుభ్రం చేసుకునే వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది.

సెలెబ్రిటీలు సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ కు ప్రచారం కల్పిస్తే ప్రతి ఒక్కరు కూడా చేతులను శుభ్రం చేసుకుంటారని, తద్వారా కొంతవరకు వైరస్ వ్యాప్తి జరగకుండా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. గతంలో ఐస్ బకెట్ ఛాలెంజ్ ఎలాగైతే పాపులర్ అయ్యిందో ఇప్పుడు సేఫ్ హ్యాండ్ ఛాలెంజ్ కూడా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu