HomeTelugu Newsయాసిడ్‌ దాడి బాధితులకు మద్దతుగా 'దీపిక' ఉద్యమం

యాసిడ్‌ దాడి బాధితులకు మద్దతుగా ‘దీపిక’ ఉద్యమం

14 7
బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే.. యాసిడ్‌ దాడి బాధితులకు మద్దతుగా ‘అబ్‌ లడ్‌నా హై’ అనే ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆమె తన సహనటుడు విక్రాంత్‌ మాసేతో కలసి ఈ ఉద్యమ ప్రచార గీతం వీడియోను ఈ రోజు విడుదల చేసింది. మిగతావారి లాగానే సాధారణ జీవితం గడుపుతున్న యాసిడ్‌ దాడి బాధితులను గురించి ఈ వీడియోలో చిత్రీకరించారు. ప్రముఖ బాలీవుడ్‌ గీత రచయిత గుల్జార్‌ ఈ పాటను రచించారు. ఎటువంటి పరిస్థితులకైనా ఎదురునిలిచి పోరాడాలని ఈ వీడియో గీతం పిలుపునిస్తుంది. ఈ గీతం మనసుల్లో దాచుకోవలసిన కవితాత్మక భావన అని దీపిక ఈ సందర్భంగా చెప్పింది. ‘అబ్‌ లడ్‌నా హై’ గురించి మాట్లాడుతూ మార్పునకు పునాది ప్రారంభించటం అని దీపిక అభిప్రాయపడింది. కాగా యాసిడ్‌ దాడి బాధితురాలి నిజ జీవిత గాధ ఆధారంగా దీపిక నిర్మించి, నటించిన ఛపాక్‌ చిత్రం జనవరి 10న విడుదల కానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu