HomeTelugu Trendingహాలీవుడ్‌లో రెండో చిత్రం ప్రకటించిన దీపిక

హాలీవుడ్‌లో రెండో చిత్రం ప్రకటించిన దీపిక

Deepika to make her hollywo

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె తన రెండో హాలీవుడ్‌ చిత్రం గురించి ప్రకటించారు. రొమాంటిక్‌ కామెడీ జానర్‌లో రాబోయే ఈచిత్రాన్ని ఈరోస్‌ ఎస్టీఎక్స్‌ గ్లోబల్ కార్పొరేషన్స్‌ నిర్మిస్తుంది. ఈ సినిమాలో దీపిక హీరోయిన్‌గా మాత్రమే కాకుండా.. సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. “నా బ్యానర్‌ కేఏ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ చిత్రానికి సహ నిర్మాతగా మీ ముందుకు వస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే, ప్రభావం చూపే, సృజనాత్మక చిత్రాలను అందించాలనదే కేఏ ప్రొడక్షన్స్‌ లక్ష్యం. ఈచిత్రం ద్వారా మేము.. ఎస్టీక్స్‌, టెంపుల్‌ హిల్‌ ప్రొడక్షన్స్ తో అనుసంధానం అవ్వడం థ్రిల్లింగ్‌గా ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. 2017లో వచ్చిన ‘‘XXX: Return of Xander Cage’’ అనే చిత్రంలో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది దీపిక. విన్‌ డీజిల్‌ హీరోగా నటించిన ఈచిత్రం.. సైన్స్‌ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. కాగా 2020లో విడుదలైన ఛపాక్‌ చిత్రంతో నిర్మాతగా మారింది దీపిక.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu