బిగ్‌బాస్‌ హౌస్‌లో దీప్తి-కౌశల్ రొమాన్స్!

బిగ్‌బాస్‌-2 తెలుగు 104వ ఎపిసోడ్ చాలా రొమాంటిక్‌గా సాగింది. గ్రాండ్ ఫినాలే దశకు చేరుకుంటున్న తరుణంలో బిగ్‌బాస్ ఇంటి సభ్యులకు “డేట్ విత్ మిస్టర్ హ్యాండ్సమ్” అనే రొమాంటిక్ టాస్క్‌ను ఇచ్చారు. ఈటాస్క్‌లో తనీష్ హోస్ట్‌గా ఉండగా.. దీప్తి, గీతా మాధురిలు ఇద్దరు హ్యాండ్సమ్‌లను ఎంచుకోవాలి. అలా ఎంచుకున్న రెండు జంటల్లో ఓ జంట పెర్ఫార్మెన్స్ ఆధారంగా లేట్ నైట్ డిన్నర్‌కి వెళ్లే అవకాశం ఉంటుంది. గీతా మాధురి.. రోల్ రైడాతో డేట్‌కు వెళ్లేందుకు సిద్ధపడగా.. దీప్తి నల్లమోతు కౌశల్‌తో డేట్‌కి వెళ్లేందుకు అంగీకరించింది.

ఈ రెండు జంటల్లో కౌశల్, దీప్తిల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో బిగ్ బాస్ హౌస్‌లో ఈ జంట లేట్ నైట్ డిన్నర్‌‌కి వెళ్లారు. ఈ డిన్నర్‌లో ఒకరి నొకరు ఇంప్రెస్ చేసుకుంటూ.. సాంగ్‌కి డాన్స్ చేస్తూ రొమాంటిక్ మూడ్‌లోకి వెళ్తారు. ఈ సందర్భంగా దీప్తికి కౌశల్ గిఫ్ట్ ఇచ్చి తనను ఇంప్రెస్ చేస్తాడు. అప్పుడు వారిద్ధరి మధ్య ప్రేమ పూర్వక సంభాషణలు జరిగాయి. మొత్తం మీద ఈరోజు ఎపిసోడ్‌ చాలా డిఫరెంట్‌గా సాగింది. రేపటి ఎపిసోడ్‌లో హోస్ట్‌ నాని ఎవరిపై ఏమి కామెంట్లు చేస్తాడో.. ఎవరు ఎలిమినేట్ అవుతారో అని కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకుల్లో సైతం టెన్షన్ మొదలైంది.