HomeTelugu Trending'బీ ది రియల్ మ్యాన్' కంప్లీట్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్‌

‘బీ ది రియల్ మ్యాన్’ కంప్లీట్ చేసిన దేవీ శ్రీ ప్రసాద్‌

6 28
టాలీవుడ్‌లో ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ వైరల్‌గా మారింది. అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా ప్రారంభించిన ఈ ఛాలెంజ్ రాజమౌళి, ఎన్టీఆర్, రామ్‌ చరణ్, చిరంజీవి, వెంకటేష్, కొరటాల..ఇలా ఒకరి తరువాత ఒకరుతో ఈ ఛాలెంజ్‌ ముందుకు సాగుతోంది. తాజాగా డైరెక్టర్‌ సుకుమార్‌ ఇచ్చిన ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇంటి పనుల్లో తన తల్లికి సాయం అందించాడు. ఇల్లు శుభ్రం చేసి, వంట కూడా చేసాడు. స్వయంగా తన తల్లికి ఆమ్లెట్ వేసి ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన డీఎస్పీ.. మనల్ని రియల్‌ మ్యాన్‌గా తయారు చేస్తున్న ప్రతి ఒక్క తల్లికి దీనిని అంకితం ఇస్తున్నట్టుగా చెప్పారు. అనంతరం ఈ ఛాలెంజ్ కు హీరోలు అల్లు అర్జున్ , యష్‌, కార్తి, దర్శకుడు హరీష్‌ శంకర్‌, మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ను డీఎస్పీ నామినేట్ చేశాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu