HomeTelugu Trendingవిశాల్‌ కొత్త సినిమా 'రత్నం'

విశాల్‌ కొత్త సినిమా ‘రత్నం’

vishal 34 movie rathnam

హీరో విశాల్ ప్రస్తుతం తన 34వ సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి రత్నం టైటిల్‌ను ఫైనల్ చేశారు. లారీలో నుంచి ఆవేశంతో దిగిన విశాల్‌ కత్తి చేత పట్టి శత్రువులను చీల్చి చెండాడుతున్న విజువల్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్‌ లుక్‌తోపాటు ఫస్ట్ షాట్‌ వీడియో గూస్‌ బంప్స్‌ తెప్పిస్తూ అంచనాలు పెంచుతోంది.

ఇప్పటికే లాంఛ్ చేసిన విశాల్‌ 34 అనౌన్స్ మెంట్‌ పోస్టర్‌లో చుట్టూ గన్స్‌, కత్తులు కనిపిస్తూ.. మధ్యలో స్టెతస్కోప్‌ ఉన్న లుక్‌ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమా కోసం కెరీర్‌లో తొలిసారి రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేయబోతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్‌ అందించింది విశాల్ టీం. డీఎస్పీ జర్నీతో డిజైన్‌ చేసిన విశాల్‌ 34 తాజా వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఈ సినిమాకి హరి దర్శకత్వం వహిస్తున్నాడు. భరణి, పూజ సినిమాల తర్వాత హరి డైరెక్షన్‌లో విశాల్‌ నటిస్తోన్న మూడో సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో ప్రియా భవానీ శంకర్‌ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది. స్టోన్ బెంచ్‌ ఫిలిమ్స్‌-జీ స్టూడియోస్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. విశాల్‌ మరోవైపు తుప్పరివాలన్2లో కూడా నటిస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu