నాగార్జున.. అఖిల్‌తో రకుల్..!

అక్కినేని నాగార్జున వయసు 60 వచ్చినా ఇంకా నవ మన్మధుడు లాగానే కనిపిస్తున్నాడు. వయస్సులో అఖిల్‌తో పోటీ పడుతున్నట్టు ఉన్నాడు. ఒకవైపు సినిమాలు చేస్తూ మరోవైపు కళ్యాణ్ జువెలర్స్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్స్ వంటి వాటికి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ బిజీగా మారిపోయాడు. అటు నాగచైతన్య, అఖిల్ ను సినిమాల్లో ప్రమోట్ చేస్తున్నాడు.

నాగార్జున, అఖిల్ లు ఎన్టీఆర్ బయోపిక్ లోని జూనియర్ అందాల తార రకుల్ ప్రీత్ సింగ్‌తో కలిసి రాజమండ్రిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం ప్రైవేట్ ఫ్లైట్ లో ప్రయాణిస్తూ సెల్ఫీ దిగారు. ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది.