HomeTelugu Big Storiesగుండుతో స్టార్‌ హీరో.. వైరల్‌

గుండుతో స్టార్‌ హీరో.. వైరల్‌

Dhanush at Tirupati temple
కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్‌కి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇటీవలే ‘సార్’ సినిమా తో తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ధనుష్ తమిళం తో పాటు హిందీ.. ఇంగ్లీష్ మరియు తెలుగు సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.

సార్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మరియు ఆ తర్వాత కూడా ధనుష్ పెద్ద జుట్టు మరియు గుబురు గడ్డం తో కనిపించాడు. ఇప్పుడు ధనుష్ కొత్త లుక్ తో వార్తల్లో నిలిచాడు. తాజాగా తిరుపతి లో ధనుష్ సందడి చేశాడు. అక్కడ తన పిల్లలతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అంతే కాకుండా శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చాడు.

గుండు లో ధనుష్ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఒక స్టార్ హీరో గుండు చేయించుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. ధనుష్ తనకు ఉన్న భక్తితో పాటు సింప్లిసిటీని నిరూపించుకుంటూ గుండులో కనిపించాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!