HomeTelugu Trendingధోనీ LGM మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

ధోనీ LGM మూవీ నుంచి వీడియో సాంగ్ రిలీజ్

LGM Video song

భారత స్టార్ క్రికెటర్ సాక్షి సింగ్ ధోనీ నిర్మాతగా ‘LGM’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ధోనీ బ్యానర్ లో నిర్మితమైన మొదటి సినిమా ఇది. కామెడీ కథాంశంతో రూపొందుతున్న ఈ మూవీలో హరీష్ కల్యాణ్, ఇవాన జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాకు రమేశ్ తమిళమణి డైరెక్టర్.

తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఆగస్టు 4న విడుదల చేస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి తాజాగా ఒక వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

‘లలనా .. లలనా ప్రేమ ఒళ్లో పడ్డానా’ అంటూ ఈ పాట సాగుతోంది. హీరో, హీరోయిన్‌పై బీచ్‌లో నైట్‌లో చిత్రీకరించిన పాట ఇది. ఈ సినిమాకి సంగీతాన్ని కూడా రమేశ్ తమిళమణి అందించడం విశేషం. నదియా, యోగిబాబు, దీపా శంకర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ‘లవ్ టుడే’ సినిమాతో తెలుగులోను యూత్ ను ఆకట్టుకుంది ఇవాన. ఈ సినిమాతో తెలుగులో మరింత అభిమానులు పెరిగే అవకాశం ఉంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu