‘రౌడీ బేబి’..మేకింగ్‌ వీడియో పై ఓ లుక్కేయండి

తమిళ ప్రముఖ నటుడు ధనుష్‌, సాయిపల్లవి జంటగా నటించిన సినిమా ‘మారి2’. గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద మిశ్రమ ఫలితాన్ని అందుకుంది. అయితే, ఇందులోని ఓ పాట మాత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంది. అదే ‘రౌడీ బేబి’. తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఈ పాటకు విశేష ఆదరణ లభించింది. జనవరి 2న యూట్యూబ్‌లో ఈ పాటను విడుదల చేయగా, ఇప్పటి వరకూ 26కోట్ల మంది వీక్షించారు. మరి అంతలా ఆకట్టుకున్న పాటను ఎలా తెరకెక్కించారో వివరిస్తూ చిత్ర బృందం మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. యువన్‌ శంకర్‌ రాజా స్వరాలు సమకూర్చిన ఈ పాటను ధనుష్‌, ఢీ పాడారు. ప్రభుదేవా కొరియోగ్రఫీ అందించారు. కామెడీ, యాక్షన్‌ మసాలా మూవీగా బాలాజీ మోహన్‌ ‘మారి2’ను తెరకెక్కించారు. మరి రౌడీ బేబి ఎలా తెరకెక్కిందో మీరూ చూసేయండి!