HomeTelugu Trendingఅంగరంగ వైభవంగా దిల్‌రాజు వివాహ వేడుక

అంగరంగ వైభవంగా దిల్‌రాజు వివాహ వేడుక

1 10
ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో నిజామాబాద్ జిల్లాలోని నార్సింగ్ పల్లి గ్రామంలో జరిగిన ఈ వేడుకకు కొద్దిమంది అతిధులు మాత్రమే హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు దిల్ రాజు కూతురు హర్షిత రెడ్డి పెళ్లి పెద్దగా వ్యవహరించడం విశేషం.

దిల్ రాజు మొదటి భార్య కొన్ని రోజుల క్రితం అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత రాజు ఒంటరిగా ఉంటున్నారు. దిల్ రాజు రెండో వివాహం చేసుకుంటారని కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu