దిల్ రాజు అంచనా తప్పు కాలేదు!

కథల ఎంపికలో ఆ కథకు ఎవరు సెట్ అవుతారు.. సినిమాకు ఎప్పుడు రిలీజ్ చేస్తే హిట్ అవుతుంది.. ఇటువంటి విషయాల్లో దిల్ రాజు అంచనా తప్పు కాదని మరోసారి నేను లోకల్ సినిమా నిరూపించింది. నిజానికి ఈ సినిమా బెక్కమ్ వేణుగోపాల్ నిర్మాణంలో రాజ్ తరుణ్ హీరోగా
అనుకున్నారు. అయితే దిల్ రాజు సపోర్ట్ కోసం ఆయన దగ్గరకు వెళ్లగా.. ఈ కథ రాజ్ తరుణ్ కంటే నానికి బావుంటుందని చెప్పారు. అంతేకాదు కథ ఇస్తే సినిమాను తనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పాడు.

దీంతో బెక్కమ్ వేణుగోపాల్ తెర వెనుక నుండి కథను నడిపించారు. అయితే ఇప్పుడు సినిమా చూసిన వారంతా.. నాని తప్ప ఈ రోల్ ఎవరు చేసిన సినిమా ఇంత పెద్ద హిట్ అయ్యేది కాదని అంటున్నారు. రాజ్ తరుణ్ నటించి ఉంటే సినిమా చూపిస్త మావ సినిమాను తిప్పి తీశారనే భావన కలిగేది.. కానీ నాని కావడంతో కథకు ఫ్రెస్ నెస్ యాడ్ అయింది. భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. యు.ఎస్. ప్రీమియర్ కలెక్షన్స్ కూడా ఓ రేంజ్ లో వచ్చాయి.