HomeTelugu Trending'రౌడీ బాయ్స్' తో దిల్‌రాజు

‘రౌడీ బాయ్స్’ తో దిల్‌రాజు

7 21
నిర్మాత దిల్ రాజు వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నారు. ఆయన బ్యానర్లో ఒక్క సినిమా చేసినా చాలు అని యంగ్ హీరోలు అనుకుంటూ వుంటారు. అలాంటి దిల్ రాజు .. ఈ సారి తన బ్యానర్ నుంచి ఒక కొత్త హీరోను పరిచయం చేయనున్నాడు. ఆ హీరో ఎవరో కాదు .. దిల్ రాజు సోదరుడు శిరీశ్ రెడ్డి తనయుడు ఆశిశ్ రెడ్డి.

కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను .. స్క్రిప్ట్ పనులను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి ‘రౌడీ బాయ్స్’ అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందని చెబుతున్నారు. ‘హుషారు’ ఫేమ్ శ్రీహర్ష ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu