HomeTelugu Big Storiesప్రియదర్శి 'బలగం' ట్రైలర్‌

ప్రియదర్శి ‘బలగం’ ట్రైలర్‌

Balagam Trailer

ప్రియదర్శి ‘బలగం’ ట్రైలర్‌టాలీవుడ్‌ హాస్య నటుడు ప్రియదర్శి – కావ్య హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘బలగం’. దిల్ రాజు ప్రొడక్షన్లో హర్షిత్ రెడ్డి – హన్షిత ఈ సినిమాని నిర్మించారు. వేణు ఎల్దండి దర్శకత్వం వహించాడు. భీమ్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను మార్చి 3వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈక్రమం లో ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఇది తెలంగాణ ప్రాంతంలో .. గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. హీరో – హీరోయిన్ మధ్య ప్రేమ .. హీరో బాకీతో ముడిపడిన అతని నిశ్చితార్థం .. ఆయన టెన్షన్ పడటం వంటి సన్నివేశాలపై కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది.

పల్లె అందాలు .. అక్కడి మనుషుల ఆత్మీయత .. వాళ్ల మాట తీరును ప్రతిబింబించేదిగా ఈ ట్రైలర్ కనిపిస్తోంది. ఇంతవరకూ తన బ్యానర్లో వచ్చిన చెప్పుకోదగిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా చేరుతుందని దిల్ రాజు చెప్పడంతో అంచనాలు ఏర్పడ్డాయి.

ప్రియదర్శి ఇదివరకు ‘మల్లేశం’ హీరోగా నటించాడు. చేనేత కళాకారుడు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడినది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ప్రియదర్శిక మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పడు ‘బలగం’ ట్రైలర్‌ కూడా నేచురల్‌గా ఉండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu