నటుడి మృతిపై మోడీ సంతాపం

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిన్యర్‌ కాంట్రాక్టర్‌(79) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ‘చోరీ చోరీ చుప్కే చుప్కే’, ‘దిల్‌ విల్‌ ప్యార్‌ వ్యార్‌’, ‘ఖిలాడీ’, ‘బాద్‌షా’ వంటి ఎన్నో చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించిన దిన్యర్‌ను ఈ ఏడాది జనవరిలో భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ట్విటర్‌ వేదికగా ఆయనకు సంతాపం తెలిపారు.

‘పద్మశ్రీ దిన్యర్‌ కాంట్రాక్టర్‌ ఓ నటుడిగా ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే ఆయన ఎక్కడుంటే అక్కడ నవ్వులు పండేవి. థియేటర్‌, టీవీ, సినిమా.. ఇలా మాధ్యమం ఏదైనా సరే.. తన అద్భుతమైన నటనతో ఎందరో ముఖాలపై చిరునవ్వులు పూయించారు. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం బాధాకరం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని పేర్కొంటూ దిన్యర్‌కు షేక్‌హ్యాండ్‌ ఇస్తున్నప్పుడు దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.