HomeTelugu Big Storiesహన్సికపై డైరెక్టర్‌ శంకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

హన్సికపై డైరెక్టర్‌ శంకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Director Shankar shocking

టాలీవుడ్‌లో పలు సినిమాల్లో నటించి తెలుగు మంచి గుర్తింపు తెచ్చుకుంది హన్సిక. ఆ తర్వాత కోలీవుడ్‌కే పరిమితమైంది. గతేడాది పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం ఆది పినిశెట్టితో కలిసి ‘పార్ట్‌నర్’ సినిమాలో నటించింది. ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది. ఇటీవలే చెన్నైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హన్సికపై కోయాక్టర్ రోబో శంకర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్న క్రమంలో.. నెటిజన్లు సైతం శంకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘పార్ట్‌నర్’ సినిమాలో హన్సిక కాళ్లను తాకాల్సిన సీన్ ఒకటి ఉందని రోబో శంకర్ తెలిపారు. కానీ ఆ సీన్ చేసేటపుడు తాను హన్సిక కాలినే కాదు బొటనవేలు తాకడానికి కూడా ఆమె ఒప్పుకోలేదని చెప్పారు. కానీ ఇదే సినిమాలో హీరో ఆది తన కాలు తాకడానికి అనుమతించిందని, హీరోగా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని స్పీచ్‌లో పేర్కొన్నారు శంకర్.

ఈ సందర్భంలో వేదికపైనే ఉన్న హన్సిక అతడి వ్యాఖ్యలతో కలత చెందగా.. శంకర్ మాత్రం తన కామెంట్స్‌ను జోవియల్‌గా తీసుకోవాలని పేర్కొనడం విశేషం. అయితే, ఇదే కార్యక్రమంలో పాల్గొన్న ఓ జర్నలిస్ట్ సైతం శంకర్ తన లిమిట్స్ క్రాస్ చేశారని తెలిపింది. తెలుస్తున్న సమాచారం మేరకు ‘పార్ట్‌నర్’ మూవీ టీమ్.. రోబో శంకర్ తరపున హన్సికకు క్షమాపణలు చెప్పింది. కానీ టీమ్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన సోషల్ మీడియాలో విడుదల కాలేదు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో యోగి బాబు, పాలక్ లాల్వానీ, పాండ్యరాజన్, జాన్ విజయ్, రవి మారియా, టైగర్ తంగదురై తదితరులు నటించారు. సంతోష్ ధయానిధి మ్యూజిక్ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!