HomeTelugu Trendingచిరంజీవి-బాలకృష్ణ వివాదంపై డైరెక్టర్‌ తేజ షాకింగ్‌ కామెంట్స్‌

చిరంజీవి-బాలకృష్ణ వివాదంపై డైరెక్టర్‌ తేజ షాకింగ్‌ కామెంట్స్‌

9 2
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో.. టాలీవుడ్ లో షూటింగ్ లు నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా కేంద్రం లాక్‌డౌన్ లో చేసిన సడలింపులతో రాష్ట్రంలో కూడా సడలింపులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆగిపోయిన షూటింగ్‌లను కూడా తిరిగి ప్రారంభించాలని సినీ పెద్దలు నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం సినిమాల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో చిరంజీవి ఇంట్లో ఓ మీటింగ్‌ను ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో ఇండస్ట్రీ కి చెందిన కొంతమంది పెద్దలను మాత్రమే పిలవటం గొడవలకు దారి తీసింది. ఆ మీటింగ్ పై ఓ ఇంటర్వ్యూలో బాలయ్య కామెంట్లు చేయగా…బాలయ్య కామెంట్లకు సమాధానమిస్తూ నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశాడు.

దాంతో ఆ వివాదం పెద్దగా మారింది. ఇప్పుడు తాజాగా ఆ ఇష్యూ పై డైరెక్టర్‌ తేజ స్పందించాడు. నేను సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్ని కాదు కాబట్టి నన్ను పిలువలేదు, పర్సనల్ మీటింగ్‌ అయితే ఎవరినీ పిలవాల్సిన అవసరం లేదు కానీ అది ఇండస్ట్రీ కి సంబందించిన విషయం కాబట్టి అందరినీ సంప్రదించి తీసుకుంటేనే కరెక్ట్ అని కామెంట్ చేశాడు. టాప్‌ డైరెక్టర్లు వస్తుంటారు పోతుంటారు. ఇండస్ట్రీ ఎప్పటికీ అలాగే ఉంటుంది. నేను ఇండస్ట్రీని నడిపిస్తున్నాను అనుకోవడం అవివేకం అంటూ షాకింగ్ కామెంట్లు చేసాడు. ఇక ఈ వివాదం సద్దుమణుగుతుందనుకుంటే రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇక తేజ చేసిన కామెంట్లతో మరింత ఈ వివాదం ఏటువైపు వెళ్తుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!