ప్రభాస్ తరువాతి ప్లేస్ బన్నీదే!

ఈ మధ్యకాలంలో సినిమాలో ఉన్న కంటెంట్ తో కంటే మిగతా విషయాలతో ఎక్కువగా పాపులర్ అయి అందరి నోళ్ళలో నానిన సినిమా DJ.ఈ సినిమా రొటీన్ గా ఉందంటూ విమర్శకులు రాస్తే లేదు ఇది కమర్షియల్ సినిమా సూపర్ గా ఉందంటూ డైరెక్టర్ హరీష్ శంకర్,హీరో బన్నీ క్లాసులు పీకారు.అయితే ఆ తరువాత పోస్టర్లలో ఒక్క వారంలో 100 కోట్లు అని వెయ్యగానే మ్యాటర్ మొత్తం తేడా కొట్టేసింది. అయితే ఆ గొడవ ఎప్పుడో ముగిసి పోయింది. అయితే ఈ మధ్యే ఆ సినిమాని సాటిలైట్ రైట్స్ కొనుక్కున్న టి.వి.ఛానెల్ టెలికాస్ట్ చేసింది. సిల్వర్ స్క్రీన్ మీద అనేక వివాదాలతో సెన్సేషన్ అయినా DJ బుల్లితెరపై మాత్రం నిజమయిన సెన్సేషన్ గా నిలిచింది.టి.ఆర్.పి రేటింగ్స్ లో దుమ్ముదులిపేసింది.

ఏకంగా 21 పాయింట్స్ కంటే ఎక్కువగానే రేటింగ్ తెచ్చుకుని ఏకంగా ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన బాహుబలి ది కంక్లూషన్ కి అతి చేరువలోకి వచ్చింది. నిజానికి DJ తీసిపడేయాల్సిన సినిమా కాదు.అలా అని ఓ సూపర్ అనడానికి కూడా లేదు.కానీ థియేటర్స్ దగ్గర సాధించిన నిజమయిన కలెక్షన్స్ కంటే టెలివిజన్ లోనే ఎక్కువ ఆదరణ దక్కించుకుంది ఈ కమర్షియల్ ఎంటెర్టైనెర్. కొన్ని సినిమాలు థియేటర్స్ లోకంటే టి.వి లలో ఎక్కువ హిట్ అవుతాయి. సో,DJ కూడా అదే కోవలోకి చేరింది.దీంతో ఈ సినిమా కొనుకున్న ఛానెల్ పంట పండింది.