HomeTelugu Trendingదివి సిలక ముక్కుదానా.. సాంగ్‌ వైరల్‌

దివి సిలక ముక్కుదానా.. సాంగ్‌ వైరల్‌

Divi silaka mukku dana fu

బిగ్‌బాస్‌ బ్యూటీ దివి సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. తన హాట్‌ హాట్‌ అందాల ఫొటోషూట్‌లను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ కుర్రకారును ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా దివి ఓ ఫోక్‌ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సాంగ్‌ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ పాటకు సంబంధించిన ఫుల్‌ వీడియో విడులైంది.

ఈ పాటలో.. లంగాఓణి, ఫుల్‌ జ్యూవెల్లరి, ముక్కపుడకతో దివి నెటిజన్లను ఆకట్టకుంటుంది. విడుదలైన 2 గంటల్లోనే ఈ పాట 44 వేలకు పైగా వ్యూస్‌ రాబట్టి దూసుకుపోతోంది. ‘సిలక ముక్కుదానా.. అని ముద్దుగా పిలుస్తాడే’ అంటూ తెలంగాణ నేపథ్యంలో సాగే ఈ పాటకు దివి మాస్‌ స్టేప్పులతో ఇరగదీసింది. కాసర్ల శ్యాం లిరిక్స్‌ రాసిన ఈ పాటను గాయనీ హారిక నారాయణ్‌ ఆలపిచింది. శేఖర్‌ మాస్టర్‌ దర్శకత్వం, కొరియోగ్రఫీ అందించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu