ఇప్పటికీ నన్ను అలానే చూస్తున్నారు!

పోర్న్‌స్టార్‌ గా కెరీర్ మొదలుపెట్టిన సన్నీలియోన్ ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది. ఆమె జీవితం ఆధారంగా.. ఇప్పుడు ‘మోస్ట్లీ సన్నీ’ పేరుతో విడుదలైన డాక్యుమెంటరీలో సన్నీకు సంబందించిన పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు. వాస్తవానికి సన్నీ అశ్లీల సినిమాలు విడుదలయ్యే వరకు ఆమె అటువంటి సినిమాల్లో నటిస్తుందన్న సంగతి ఎవరికి తెలియదట. ఈ విషయం కాస్త ఆమె తల్లితండ్రుల వరకు చేరేసరికి సన్నీ చాలా ఇబ్బందిగా ఫీల్ అయిందట. మొదట్లో ఆమె డబ్బుల కోసం పెళ్లిళ్లలో డాన్సులు కూడా చేసేదట.

నేను చేసిన పిచ్చి పనుల్లో అదొకటి అని ఆమె చాలా సంధార్భాల్లో చెప్పుకొచ్చింది. ఎప్పుడైతే ఆమె తల్లితండ్రులకు తను పోర్న్ స్టార్ అని తెలిసిందే అప్పుడు వాళ్ళు తలెత్తుకోలేకపోయారని సన్నీ తెలిపింది. ఇక కొన్ని రోజుల తరువాత ఆమె ఇష్టానికే తన జీవితాన్ని వదిలేశారని తెలుస్తోంది. అందరినీ ఎంటర్టైన్ చేయడానికే తను ధైర్యం చేశానని సన్నీ తెలిపింది. ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నప్పటికీ తనను ఇంకా పోర్న్‌స్టార్‌ గానే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

CLICK HERE!! For the aha Latest Updates