సన్నీలియోన్‌ను ఏడిపించిన సల్మాన్‌ఖాన్ సోదరుడు

బాలీవుడ్‌ నటి శృంగార తార సన్నీ లియోన్ తెలియని వారుండరు. తన అందాలతో కుర్రకారుని ఉర్రూత లూగించే సన్నీలియోన్‌ను సల్మాన్‌ ఖాన్ సోదరుడు అర్బాజ్‌ ఖాన్ కన్నీరుమున్నీరయ్యేలా చేశాడట. ఈ విషయాన్ని ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత, సల్మాన్‌ సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌ ఓ కార్యక్రమంలో మీడియా ద్వారా వెల్లడించారు. అర్బాజ్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న “పించ్‌” అనే కార్యక్రమానికి సన్నీలియోన్‌ ఇటీవల హాజరయ్యారు.

సోషల్‌ మీడియాలో సెలబ్రిటీల పోస్ట్‌లపై, ఫొటోలపై నెటిజన్లు చేసే కామెంట్లు, వారు అడిగే ప్రశ్నల గురించి చర్చించడం ఈ షో ప్రత్యేకత. ఈ సందర్భంగా అర్బాజ్‌ ఖాన్‌ సన్నీని తన కెరీర్‌కు సంబంధించిన పలు ప్రశ్నలు అడిగారు. అందులో భాగంగా సన్నీలియోన్‌పై ఓ నెటిజన్‌ చేసిన అసభ్యకరమైన కామెంట్‌ను అర్బాజ్‌ ఖాన్ చదివి వినిపించడంతో ఆమె అక్కడికక్కడే బోరున విలపించారు. ఆమెను ఓదార్చేందుకు అర్బాజ్‌ చాలా ప్రయత్నించారట. సన్నీలియోన్‌ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టక ముందు శృంగారతారగా జీవితంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అవన్నీ మర్చిపోయి సినిమాలు చేసుకుంటున్నా కూడా పలువురు ప్రేక్షకులు ఇంకా తన పాత విషయాలను గుర్తుచేస్తూ బాధపెడుతున్నారని కన్నీరుమున్నీరయ్యారు.

CLICK HERE!! For the aha Latest Updates