సన్నీలియోన్‌తో కలిసి యువ హీరో నవదీప్..!


హాట్ స్టార్ సన్నీలియోన్‌తో కలిసి టాలీవుడ్ యువ హీరో నవదీప్ వెబ్‌ సిరీస్‌లో నటించబోతున్నాడు. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న రాగిణి ఎంఎంఎస్ రిటర్న్స్ సీజన్-2లో సన్నీతో కలిసి నటించబోతున్నాడు. ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని నవదీప్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. సన్నీతో కలిసి దిగిన ఓ ఫొటోను షేర్ చేశాడు. సన్నీతో కలిసి నటించడం హ్యాపీగా ఉందని, సన్నీ సెట్‌లో చాలా ఫన్నీగా ఉంటారని అన్నాడు. ఈ యువ హీరో 2004లో వచ్చిన “జై” సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించాడు. గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ, ఆర్య-2, ఓమై ఫ్రెండ్, ధ్రువ తదితర చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ 19వ చిత్రం అలవైకుంఠపురంలో నవదీప్ ఓ పాత్ర పోషిస్తున్నాడు.