HomeTelugu Newsఆకట్టుకుంటున్న ''వీరమహాదేవి'' ఫస్ట్ లుక్

ఆకట్టుకుంటున్న ”వీరమహాదేవి” ఫస్ట్ లుక్

ఐటెం సాంగ్స్ తో ప్రేక్షకులను ఉర్రూత లూగించే సన్నీలియోన్ ఇప్పుడు వీరమహాదేవిగా వీరనారి, ఓ పరాక్రమ రాణి పాత్రలో 3
గంటల పాటు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది.
దక్షిణాదిలో మరో గ్రాండ్ విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సినిమా చూడబోతున్నామనిపిస్తుంది. ఈ సినిమా దాదాపు 100 కోట్ల
బడ్జెట్ తో హిందీతో పాటు తెలుగు, తమిళం భాషల్లో తెరకెక్కబోతుంది.

5 2

ఈ చిత్రానికి పెట్టుబడులు పెట్టేందుకు భారీ సంస్థలే ముందుకొచ్చాయి. వి.సి. వడివుడయాన్ దర్శకత్వంలో స్టీవ్స్ కార్నర్
పతాకంపై ఈ సినిమా నిర్మాణం జరగబోతుంది. ఇందుకోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్స్ ఇచ్చిందట. ఈ సినిమా ఫస్ట్
లుక్ చూస్తుంటే గతేడాది విడుదలై విజయం సాధించిన ”వండర్ ఉమెన్” చిత్రం స్ఫూర్తిగా ఈ చిత్రం రాబోతున్నట్టు
చెప్పొచ్చు. అయితే బడ్జెట్ దృష్ట్యా వండర్ ఉమెన్ తో పోల్చలేము గాని, గాల్ గాడోట్ కి ఏ మాత్రం తగ్గని ఛరిష్మా
సన్నీలియోన్ కి ఉందని చెప్పొచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu