HomeTelugu Trendingర్రాజశేఖర్ 'శేఖర్' మూవీ ట్రైలర్ వచ్చేసింది....!

ర్రాజశేఖర్ ‘శేఖర్’ మూవీ ట్రైలర్ వచ్చేసింది….!

Shekar trailer Looks engaging

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ రీఎంట్రీ తర్వాత విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నారు. ఆ క్రమంలో గరుడవేగ తో హిట్ కొట్టారు. ఆ తర్వాత వచ్చిన కల్కి మూవీ కూడా పర్వాలేదనిపించింది. గరుడ వేగ లో రాజశేఖర్ నేషనల్ సెక్యూరిటీ ఏజెంట్ గా నటించారు. కల్కిలో పోలీస్ గా నటించారు. తాజా నటిస్తున్న చిత్రం  ‘శేఖర్’, ఈ మూవీ లో కూడా ఆయన పోలీస్ అధికారిగానే నటిస్తున్నారు. కాకపోతే ఈ చిత్రంలో పోలీస్ అధికారిగా తన జాబ్ కి రాజశేఖర్ రాజీనామా చేస్తారు.

తాజాగా శేఖర్ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ‘పోలీస్ యూనిఫామ్ వేసుకుని కూడా డ్యూటీ చేయనివాళ్ళు చాలా మంది ఉన్నారు.. అదే పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి కూడా డ్యూటీ అంటే ప్రాణం ఇచ్చే వ్యక్తులు వేలల్లో ఒకరు మాత్రమే ఉంటారు’ అంటూ వాయిస్ ఓవర్ తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రంలో రాజశేఖర్ కుమార్తె శివాని నటిస్తోంది. రాజశేఖర్ తన భార్యతో విడిపోవడం.. ఆమెకు యాక్సిడెంట్ కావడం లాంటి అంశాలు ట్రైలర్ లో చూపించారు. మొత్తంగా రాజశేఖర్ మరో థ్రిల్లర్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి రాజశేఖర్ సతీమణి జీవిత దర్శకత్వం వహించడం విశేషం. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu