‘శేఖర్‌’ మూవీ ఫస్ట్‌గ్లిమ్స్‌

హీరో రాజశేఖర్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘శేఖర్‌’.జీవిత రాజశేఖర్‌ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ గ్లిమ్స్ ని విడుదల చేశారు. ఓ రిపోర్టర్‌ చదివిన నేర వార్తతో ప్రారంభమైన ఈ టీజర్‌ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. ‘వాడెప్పుడైనా మనం చెప్పింది చేశాడా.. వాడు చేసేది మనకు చెప్పాడా’ అని కథానాయకుడి పాత్ర తీరు గురించి సాగిన సంభాషణ మెప్పిస్తుంది. రాజశేఖర్‌ పవర్‌ఫుల్‌ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజశేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, బొగ్గారం వెంకట శ్రీనివాస్‌ నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

CLICK HERE!! For the aha Latest Updates