‘అన్‌స్టాప‌బుల్-2’ పవర్‌స్టార్‌తో ఆ ఇద్దరు దర్శకులు!


నంద‌మూరి బాల‌కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహారిస్తున్న టాక్‌ షో ‘అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 2’. డబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ తో ఈ షో విజయవంతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే టాలీవుడ్ హీరోలు, దర్శక, నిర్మాతలతోపాటు కొంతమంది పొలిటికల్ లీడర్లతో బాలకృష్ణ చిట్ చాట్ చేసిన ఎపిసోడ్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. తాజాగా కొత్త ఎపిసోడ్‌కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు వైరల్‌ అవుతుంది.

ఈ షోకి పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ చీఫ్‌ గెస్ట్‌గా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక పవన్‌ కల్యాణ్‌తో డైరెక్టర్లు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, క్రిష్‌ కూడా రాబోతున్నారట. తాజా గాసిప్‌ ప్రకారం క్రిష్, త్రివిక్రమ్‌ ఎపిసోడ్‌ ముగింపులో పవన్‌ పక్కన సీటును షేర్ చేసుకోబోతున్నారట. త్రివిక్రమ్‌-పవన్‌ కల్యాణ్‌ కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రస్తుతం పవన్‌ కల్యాణ్‌ క్రిష్ డైరెక్షన్‌లో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్నాడు. ఇద్దరు లీడింగ్ డైరెక్టర్లతో ఒకే ప్లాట్‌ఫాంపై పవన్ సందడి చేయబోతున్నాడన్న వార్తతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. పవన్‌ ఎపిసోడ్‌ను త్వరలోనే షూట్‌ చేయబోతున్నారన్న వార్తలపై ఆహా టీం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

CLICK HERE!! For the aha Latest Updates