HomeTelugu Trending''దృశ్యం 2'' టీజర్‌

”దృశ్యం 2” టీజర్‌

Drushyam 2 Teaser

విక్టరీ వెంకటేష్ హీరోగా మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ”దృశ్యం 2”. వెంకటేష్‌ కెరీర్ లో వస్తున్న 75వ చిత్రం. ‘దృశ్యం’ సినిమాకు సీక్వెల్. అలానే మలయాళంలో మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం 2’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్.

ఎప్పుడో పూర్తైన ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్‌ చేయడానికి మేకర్స్ మొగ్గుచూపారు. మాతృక బాటలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేయనున్నారు. నవంబర్ 25 నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘దృశ్యం 2’ టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

‘దృశ్యం’ ఎక్కడ ముగిసిందో అక్కడి నుంచే ‘దృశ్యం 2’ సినిమా మొదలవుతుందని టీజర్ చూస్తే అర్థం అవుతోంది. నదియా, నరేష్, సంపత్ నంది, తనికెళ్ళ భరణి , జయకుమార్, సత్యం రాజేష్ తదితరులు నటిస్తున్నారు. డి.సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నారప్ప’ తర్వాత ఈ నెల 25న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కాబోతోన్న వెంకటేష్ సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu