HomeTelugu Trendingహీరో విక్రమ్‌కి ప్రమాదం.. విరిగిన పక్కటెముక

హీరో విక్రమ్‌కి ప్రమాదం.. విరిగిన పక్కటెముక

Hero Vikram injured in movi
తమిళ స్టార్‌ హీరో చియాన్ విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘తంగలాన్’. ఈ సినిమా షూటింగ్ రిహార్సల్స్ లో విక్రమ్ ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. విక్రమ్ ను పరీక్షించిన డాక్టర్లు.. ఆయన పక్కటెముక ఒకటి విరిగిందని వెల్లడించారు.

ఆపరేషన్ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. విక్రమ్ కోలుకోవడానికి సమయం పడుతుందని అన్నారు. కాగా, డైరెక్టర్ పా రంజిత్ ఆధ్వర్యంలో విక్రమ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా తంగలాన్. ఈ సినిమాలో మాళవిక మోహన్, పార్వతి తిరువోతు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ భాషలలో రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Hero Vikram i1

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. పొన్నియన్ సెల్వన్ 2 సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో తంగలాన్ సినిమా చిత్రీకరణకు విక్రమ్ కొంతకాలంగా దూరంగా ఉన్నారు. తాజాగా తంగలాన్ సినిమా షూటింగ్ రిహార్సల్ సెషన్ లో పాల్గొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఈ సినిమా రిహార్సల్ సెషన్ జరుగుతోంది.

తంగలాన్ సినిమా కోసం విక్రమ్‌ 57 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిగా స్టంట్స్ చేశాడు. యూనిట్ సభ్యులు వద్దని వారించినా కూడా యాక్షన్ సన్నివేశాల కోసం చాలా ఎక్కువ కష్టపడ్డాడని తెలుస్తోంది. అంతా సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో విక్రమ్ కు ప్రమాదం జరగడంతో యూనిట్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu