వెంకటేష్‌ చిన్న కూతురు న్యూలుక్ చూశారా!

విక్టరీ వెంకటేష్‌ నటించిన ‘దృశ్యం’ సినిమాలో చిన్న కూతురిగా నటించిన ‘ఎస్తేర్ అనిల్ గుర్తుందా… ఆ సినిమా వచ్చి సరిగ్గా ఆరు సంవత్సరాలు అయ్యింది. ఆ సినిమాలో చిన్న పాపగా కనిపించిన ఎస్తేర్ ఇప్పుడు అంటే ఆరు సంవత్సరాల తర్వాత చూస్తే హీరోయిన్ రేంజ్ లో కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెటీజన్‌లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మలయాళ ప్రేక్షకులకు ఆమె సుపరిచతమే అయిన్నప్పటికీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా టచ్‌లో లేదు. ప్రస్తుతం ఈ అమ్మడు హీరోయిన్ గా నటించేందుకు రెడీ అవుతుంది . 18 ఏళ్ల ఎస్తేర్ కు ప్రస్తుతం యంగ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు వస్తున్నాయట.

CLICK HERE!! For the aha Latest Updates