చరణ్ సినిమాపై అంత నమ్మకమా..?

ఈరోజుల్లో సినిమా చేయడం ఒక ఎత్తయితే దాన్ని రిలీజ్ చేయడం మరొక ఎత్తు. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా.. పబ్లిసిటీ కంపల్సరీ. సినిమా టాక్ ఏవరేజ్ గా ఉన్నా.. దాన్ని హిట్ చేసే సత్తా పబ్లిసిటీకు ఉంది. ఈ విషయాన్ని గ్రహించి మన స్టార్ హీరోలందరు పబ్లిసిటీ విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారు.

అయితే రామ్ చరణ్ మాత్రం తన కొత్త సినిమాకు పబ్లిసిటీ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోబోతున్నాడో.. అర్ధం కావట్లేదు. సినిమా సెన్సార్ పూర్తి చేస్సుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు పోస్టర్స్, టీజర్స్ తప్ప సినిమాకు ఎలాంటి ప్రమోషన్ చేయలేదు.

ప్రమోషన్ విషయంలో దృవ సినిమా టీం ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఆడియోను డైరెక్ట్ గా మార్కెట్ లోకి విడుదల చేసి గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలనుకున్నారు. బానే ఉంది కానీ ఇప్పటివరకు ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎక్కడ చేస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు.

దర్శకుడు సురేందర్ రెడ్డి కూడా చాలా కామ్ గా ఉంటున్నట్లు తెలుస్తోంది. సినిమా మీద నమ్మకం ఎక్కువగా ఉండడం వలనే ప్రమోషన్స్ విషయంలో లైట్ తీసుకుంటున్నారా..? లేక చరణ్ మరొక ఆలోచనలో ఉన్నాడా..? ఇప్పటికైనా చరణ్ మేలుకుంటాడేమో చూడాలి!