‘గేమ్‌ చేంజర్‌’ గా రామ్‌చరణ్‌

ఈ రోజు గ్లోబల్‌ స్టార్‌ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా RC15 మూవీ టైటిల్‌ని ప్రకటించింది చిత్రబృందం. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమాకి ‘గేమ్ చేంజర్’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఓ చిన్న వీడియో గ్లింప్స్‌ను రిలీజ్‌ విడుదల చేశారు. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచేస్తుంది.

ఈ సినిమా టైటిల్ కోసం ఎప్పట్నించో ఎదురుచూస్తున్న అభిమానులకు రామ్ చరణ్ పుట్టినరోజున సరైన ట్రీట్ ఇచ్చినట్టయింది. కాగా ఇప్పటికే పలు టైటిల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. ఈ సినిమా టైటిల్‌పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. లెజెండరీ దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది.

పొలిటికల్‌ యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో శ్రీకాంత్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య తదితరులు కూడా నటిస్తున్నారు.

‘గేమ్ చేంజర్’ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక, ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ కూడా ఇవాళే విడుదల కానుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తరువాత రామ్‌ చరణ్‌ నటిస్తున్న సినిమా ఇది. అంతేకాక స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌- రామ్‌చరణ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనుండటంతో ఈ సినిమాపై ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates