మలయాళ దర్శకుడితో వెంకీ..?

venky

‘బాబు బంగారం’ సినిమా తరువాత వెంకటేష్ ‘సాలా ఖడూస్’ అనే చిత్రాన్ని తెలుగులో
రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత కూడా ఒక్కో సినిమాను ప్లాన్ చేసుకుంటున్నాడు
వెంకీ. అందులో భాగంగా మలయాళ దర్శకుడితో సినిమా చేయడానికి అంగీకరించినట్లు
సమాచారం. జీతూ జోసెఫ్ అనే దర్శకుడు గతంలో ‘దృశ్యం’ మలయాళ మాతృకకు దర్శకత్వం
వహించారు. దీంతో అతనితో కలిసి పని చేయాలనుందని అప్పట్లో వెంకీ కూడా అన్నారు.
ఈ నేపధ్యంలో ఆయన వెంకీకు కథ వినిపించరాట. అది వెంకటేష్ కు బాగా నచ్చడంతో
పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. ‘సాలా ఖడూస్’ సినిమా తరువాత
వెంకీ ఈ చిత్రాన్నే పట్టాలెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. వెంకీకు తగ్గ కథ అని తెలుస్తోంది.

 

CLICK HERE!! For the aha Latest Updates