HomeTelugu NewsJason Sanjay: ఆ స్టార్‌హీరోతో విజయ్‌ కొడుకు తొలి సినిమా!

Jason Sanjay: ఆ స్టార్‌హీరోతో విజయ్‌ కొడుకు తొలి సినిమా!

Vijays son Jason Sanjay fi

 

Jason Sanjay: కోలీవుడ్ స్టార్ హీరో దలపతి విజయ్‌ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయనకు ఇద్దరు పిల్లలు. కొడుకు జోసెఫ్‌ సంజయ్‌, కూతురు దివ్య శశి ఉన్నారు. ఇక సంజయ్‌ గతంలో ఉప్పెన సినిమాతో తమిళంలో హీరో ఎంట్రీ ఇస్తున్నాడని, విజయ్‌ సేతుపతి నిర్మాతగా ఉంటాడని పలు వార్తలు వచ్చాయి. దీంతో పాటుగా ప్రేమమ్ సినిమా దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రేన్ కూడా జేసన్ సంజయ్‌కు ఒక కథ చెప్పారట.

అయితే సంజయ్‌ మాత్రం నటుడిగా కాకుండా దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు. అంతేకాకుండా సంజయ్ లండన్‌లో డైరెక్షన్‌కు సంబంధించిన కోర్స్ కూడా చేశాడు. ఇక షారుఖ్ కొడుకు కూడా దర్శకుడిగానే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. తొలి సినిమానే లైకా ప్రొడక్షన్‌ బ్యానర్‌లో సైన్‌ చేశాడు. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్నాయి. ఈ మూవీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఈ క్ర‌మంలోనే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ సినిమాలో హీరోగా మ‌ల‌యాళ హీరో దుల్కర్ సల్మాన్‌ను న‌టించ‌నున్న‌ట్లు టాక్‌. దీనికి సంబంధించి ఇప్పటికే దుల్కర్ ప్రీ ప్రొడక్షన్ లలో కూడా పాల్గొనన్నాడని తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. హీరో దుల్కర్‌ సల్మాన్‌ నటన గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. అటువంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తాడు ఈ నటుడు. ఈ హీరోతో విజయ్‌ కొడుకు తొలి సినిమా అంటే.. మంచి ఛాన్స్‌ కొట్టేసినట్లే అంటున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu