HomeTelugu Trending'దుల్కర్‌ సల్మాన్‌' కొత్త సినిమా గ్లిమ్స్‌

‘దుల్కర్‌ సల్మాన్‌’ కొత్త సినిమా గ్లిమ్స్‌

Dulquer salmaan new movie g

తెలుగు ప్రేక్షకులకు దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు‌. ఓకే బంగారం, మ‌హాన‌టి, క‌నులు క‌నుల‌ను దోచాయంటే వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్న సినిమా ప‌తాకంపై హను రాఘవపూడి డైరెక్షన్‌లో పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా ఓ చిత్రం రూపొందుతోన్న విష‌యం తెలిసిందే.. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం నుండి ఇప్ప‌టికే విడుద‌లైన కాన్సెప్ట్ పోస్ట‌ర్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది.

తాజాగా శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి వీడియో గ్లిమ్స్‌ని విడుదల చేశారు‌. ఈ వీడియోలో మ‌ద్రాస్ ఆర్మీ ఆఫ‌స‌ర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్‌ స‌ల్మాన్ న‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ప్రేమకోసం ఆ శ్రీ రాముడి యుద్ధం చిర‌స్మ‌ర‌నీయం..త్వ‌ర‌లో త‌న ప్రేమ కావ్యంతో మ‌న ముందుకు మా లెఫ్ట్‌నెంట్ రామ్.. చెడుపై మంచి త‌ప్ప‌కుండా గెలుస్తుంది అంత వ‌ర‌కూ సేఫ్‌గా ఉండండి అని తెలిపింది మూవీ యూనిట్‌. ప్ర‌స్తుతం కాశ్మీర్‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!