‘డిజె’ రొమాంటిక్ లుక్!

అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘దువ్వాడ జగన్నాథం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. జూన్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగవంతం చేసింది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా నుండి బన్నీ లుక్స్ కొన్ని విడుదలయ్యాయి. స్కూటర్ మీద కూరగాయలు తీసుకువెళ్తూ బ్రాహ్మణ యువకుడిగా కనిపించి బన్నీ మెప్పించాడు.
అలానే ఎవరికో వార్నింగ్ ఇస్తూ ఉన్న ఒక సీరియస్ లుక్ కూడా బయటకు వచ్చింది.

తాజాగా ఈ సినిమా నుండి మరో లుక్ బయటకి వచ్చింది. ఈసారి రొమాంటిక్ డిజె బయటకు వచ్చాడు. ఈ లుక్ సినిమాలో ఓ పాటకు సంబంధించినదని తెలుస్తోంది. ఈ ఫోటోలో బన్నీ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా పాటలను మార్కెట్ లోకు విడుదల చేయబోతున్నామంటూ చిత్రబృందం ప్రకటించింది.