HomeTelugu Trendingఈగల్‌: ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

ఈగల్‌: ఫస్ట్‌ సింగిల్‌ ప్రోమో విడుదల

Eagle Movie First Single pr
టాలీవుడ్ హీరో రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ఈగల్‌. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలో ఈ మూవీ మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా ఫస్ట్ సింగిల్‌ సాంగ్ ప్రోమో విడుదల చేశారు.

రాహుల్ సిప్లిగంజ్‌ పాడిన ఈ పాటలో రవితేజలోని నయా మాస్‌ అవతార్‌ కనిపిస్తోంది. ఫుల్ లిరికల్‌ వీడియో సాంగ్‌ను డిసెంబర్ 5న లాంఛ్ చేయనున్నారు. ఈ చిత్రం 2024 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే మాస్ మహారాజా లాంగ్ హెయిర్‌, గడ్డంతో బ్లాక్ స్టైలిష్‌ గాగుల్స్ పెట్టుకొని ఉండగా.. ముందున్న టేబుల్‌పై మోడ్రన్ గన్స్ కనిపిస్తున్న లుక్‌.. ఈ సారి రవితేజ విధ్వంసం దద్దరిల్లిపోయేలా ఉండబోతుందని క్లారిటీ ఇచ్చేస్తుంది.

ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్‌, శ్రీనివాస్ అవసరాల, మధుబాల ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నారు. రవితేజ మరోవైపు గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu