HomeTelugu Trending'ఈగల్‌' టీజర్‌ అప్డేట్‌

‘ఈగల్‌’ టీజర్‌ అప్డేట్‌

Eagle movie Teaser Update

మాస్ మహా రాజా రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఈగల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమా షూటింగ్ పూర్తై పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పోస్టర్లు సినిమాపై అంచనాలు పెంచేశాయి.

ఈ క్రమంలో ఈ మూవీ ట్రైలర్ ను డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న సలార్ మూవీని ప్రదర్శించే థియేటర్లలో వేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. వీటన్నంటినీ ఖండిస్తూ ఈగల్ మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు. డిసెంబరు 20వ తేదీ సాయంత్రం 4.05 గంటలకు ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. అతడి ఊచకోతను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండమని క్యాప్షన్ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు మరోసారి క్లారిటీ ఇచ్చారు.

ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu