HomeTelugu Trendingఅత్యంత ఖరీదైన కారును కొన్న హీరో విశ్వక్ సేన్!

అత్యంత ఖరీదైన కారును కొన్న హీరో విశ్వక్ సేన్!

image 3 1

మాస్‌ కా దాస్‌ విశ్వక్‌ సేన్, రుక్సార్ దిల్లాన్‌ జంటగా కలిసి నటించిన చిత్రం ‘అశోకవనంలో అర్జున కల్యాణం’. మే 6న విడుదలైన ఈ  చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఈ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు విశ్వక్‌ సేన్. తనకిష్టమైన బెంజ్‌ జీక్లాస్‌ 2022 మోడల్‌ కారుని  సొంతం చేసుకున్నాడు విశ్వక్‌ . గతంలో విశ్వక్ సేన్ రేంజ్ రోవర్ కారును కొన్నాడు. తాజాగా బెంజ్ కారు సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ మోడల్‌ అయిన మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 కొన్నాడు..  ఇక ఈ కారు ధర చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఈ మోడల్ రేంజ్ 2. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకూ ఉంది.

image 4 1నా డ్రీం కార్ సొంతం చేసుకున్నాను. ఇదంతా మీ ప్రేమ, అభిమానం వలనే సాధ్యమైంది. అందరికీ కృతజ్ఞతలు అంటూ… ఓ ఎమోషనల్ నోట్ పంచుకున్నారు. అయితే కారుతో దిగిన విశ్వక్ సేన్‌ ఫొటోలు చూసి అభిమానులు  సంబరపడుతున్నారు. విశ్వక్‌కు అభినందనలు చెబుతున్నారు. ఇక ఈ పోస్ట్‌పై డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ రియాక్ట్‌ అయ్యారు. ‘ఆ కారు నాదే. ఫొటోలు తీసుకుంటా అంటే ఇచ్చా’ అని సరదాగా కామెంట్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu