HomeTelugu Trendingకరోనా ఎఫెక్ట్‌తో ఇంటిని ప్లాస్టిక్ క‌వర్స్‌తో క‌ప్పిన హీరో

కరోనా ఎఫెక్ట్‌తో ఇంటిని ప్లాస్టిక్ క‌వర్స్‌తో క‌ప్పిన హీరో

1 13

కరోనా నేపథ్యంలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తన మ‌న్న‌త్ బంగ్లాను ప్లాస్టిక్ కవర్లతో కప్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గాలి ద్వారా కూడా కరోనా వైర‌స్ వ్యాపిస్తుంద‌న్న ప్రతిపాదనలను కాదనలేమని ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే షారూఖ్ ఖాన్ ముందు జాగ్ర‌త్త‌ చర్యలుగా బంగ్లాను ఇలా కవర్లతో చుట్టించారని తెలుస్తోంది.

ఈ బంగ్లాలో షారూఖ్ త‌న భార్య గౌరీఖాన్‌తో పాటు ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి ఉంటారు. పండుగ సమయంలో ఆయన ఇంటికి అభిమానులు పెద్ద ఎత్తున వస్తుంటారు. కరోనా నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో ఆయన ఇంట్లోనే గడుపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu