
Mahesh Babu Real Estate Scam:
టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ బాబు ఇప్పుడు ఒక చిన్న వివాదంలో చిక్కుకున్నారు. 2025 జూలై 7న రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్ notices జారీ చేసింది. హైదరాబాద్లోని ఒక డాక్టర్ చేసిన ఫిర్యాదుపై ఈ కేసు బయటికి వచ్చింది.
ఈ డాక్టర్ చెబుతున్నది ఏమిటంటే – “మహేశ్ బాబు ప్రమోట్ చేసిన Sai Surya Developers పేరు మీద నేను Rs. 34.8 లక్షలు పెట్టుబడి పెట్టాను. వాళ్లు చెప్పినట్టు ప్లాట్ ఉంటుందని నమ్మాను. కానీ ఆ ప్లాట్ అసలే లేదు. మహేశ్ బాబు ప్రచారం చూసి నమ్మాను.” అంటే ఆమె మాటల్లోనే – మహేశ్ బాబు ఫేస్ చూడగానే project genuine అనిపించిందట.
ఇది అక్కడితో ఆగలేదు. ఏప్రిల్ 2025లో Enforcement Directorate (ED) కూడా మహేశ్ బాబును summon చేసింది. Sai Surya Developers, Surana Group మీద ఉన్న ₹100 కోట్ల real estate scamలో ఆయనకు ప్రమోషన్ పరంగా రూ. 5.9 కోట్లు, అందులో కొంత క్యాష్ రూపంలో కూడా వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. ED ఇప్పుడు ఈ డబ్బు లాండరింగ్‌లో భాగమేనా అని విచారణ చేస్తోంది.
ఇప్పటికైతే మహేశ్ బాబు పేరు ఆ కేసులో accused లిస్ట్‌లో లేదు. కానీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నందున, ఆయన పాత్రపై విచారణ జరుగుతోంది.
ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే – వీటన్నింటినీ పక్కన పెట్టి మహేశ్ బాబు మాత్రం ఎలాంటి ప్రభావం లేకుండా తన బిగ్గెస్ట్ మూవీ SSMB 29 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. డైరెక్టర్ SS రాజమౌళి, హీరోయిన్ ప్రియాంక చోప్రా, విలన్‌గా పృథ్విరాజ్ సుకుమారన్ కూడా ఇందులో ఉన్నారు. సినిమా గురించి హైప్ మామూలుగా లేదు.












