HomeTelugu Newsచిదంబరం అరెస్ట్ తర్వాత ఈడీ అనూహ్య నిర్ణయం

చిదంబరం అరెస్ట్ తర్వాత ఈడీ అనూహ్య నిర్ణయం

2 20
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేసును మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారి రాకేష్‌ అహుజాను బదిలీ చేసింది. ఆయనను ఢిల్లీ పోలీసు విభాగానికి అధికారిగా పంపిస్తున్నట్లు
గురువారం అర్థరాత్రి ప్రకటన వెలువడింది. ఆయన ప్రస్తుతం ఈడీలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

చిదంబరం అరోపణలు ఎదుర్కొంటున్న ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో ఆయన్ని కస్టడీలోకి తీసుకోవడంలో రాకేష్‌ కీలక పాత్ర పోషించారు. కాగా ఈడీ తాజా అనూహ్య నిర్ణయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంత హఠాత్తుగా అహుజాను బదిలీ చేయాల్సిన అవసరమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదిలావుండగా.. అనేక నాటకీయ పరిణామాల అనంతరం బుధవారం అరెస్ట్‌ అయిన మాజీ కేంద్రమంత్రికి సీబీఐ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైన విషయం తెలిసిందే. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అవినీతి కేసులో నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి కోర్టు అనుమతించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu