బాలీవుడ్ సినిమాలో రాందేవ్ బాబా!

యోగా గురువు రాందేవ్ బాబా త్వరలోనే బాలీవుడ్ తెరంగేట్రం చేయబోతున్నారు. లోమ్ హర్ష్ దర్శకత్వం వహిస్తోన్న ‘యే హై ఇండియా’ అనే చిత్రంలో నటిస్తున్నారు. టైటిల్ కు తగ్గట్లుగానే దేశ భక్తి నేపధ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. లండన్ లో పుట్టి పెరిగిన 25 ఏళ్ల యువకుడు భారత్ ను ఓ పేద దేశంలా భావిస్తుంటాడు. అయితే భారతదేశంలో వస్తోన్న మార్పులను చూసి తన అభిప్రాయాన్ని ఎలా మార్చుకుంటాడనే నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రాందేవ్ బా ‘సయ్యా సయ్యా’ అనే పాటలో నటించబోతున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో జరుగుతోంది. అయితే ఈ సినిమాలో
నటించడానికి ఒప్పుకున్న రాందేవ్ బాబా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం పాల్గొననని చెప్పెశాడట. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.