HomeTelugu Trendingఎనిమీ 'ఫస్ట్‌ సింగిల్' విడుదల

ఎనిమీ ‘ఫస్ట్‌ సింగిల్’ విడుదల

Enemy movie first song rel
హీరో విశాల్ నటించిన తాజా చిత్రం ‘ఎనిమీ’. ఆనంద శంకర్ డైరెక్షన్‌లో వహించిన ఈ సినిమాను మినీ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. మృణాళిని రవి నటించిన ఈ సినిమాలో, ఆర్య విలన్‌ పాత్రలో కనిపించనున్నాడు. షూటింగు పార్టును పూర్తిచేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి తాజాగా ఫస్టు సింగిల్ ను వదిలారు. ‘పడదే పడదే పడదే’ అంటూ ఈ పాట సాగుతోంది.

తమన్ స్వరపరిచిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా, పృథ్వీచంద్ర ఆలపించాడు. విశాల్ – మృణాళిని రవిపై ఈ పాటను చిత్రీకరించారు. కొంతకాలం పాటు హీరోయిన్ గా తన జోరు చూపించి నటనకు దూరమైన మమతా మోహన్ దాస్, ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రను పోషించడం విశేషం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu